4, ఏప్రిల్ 2024, గురువారం

 




ఇన్నాల్లు మంచుకు కంచెలేశారేమో..నింగిలో .. 

వెండి వాన తెగ కురుస్తుంది...ఆనందంగా..   

చిరు గాలుల సన్నాయితో   పిల్ల తెమ్మెర నాదాలతో  వయ్యారంగా ఊగిన చెట్లు... 

నేడు  కొమ్మ కొమ్మన తమ సిగలో వెండి పూలు తురుముకొని  

మిడిసిపాటుతో ఎగసిపడుతున్నాయి..    

సంక్రాంతుల సంబరాల మాటున              

ధరణిపై విరిసిన పాల నురగలా..         

ఇంటింటినీ వెండి వెన్నెల ఆవరించినట్టుగా  కురిసిన మంచు వర్షమా...  

 ఇంటిల్లిపాదినీ ఇలా ఇంటిలోనే బంధించడం న్యాయమా..?          

                                    -చంద్ర

 


నీ పాదం మీద పాటకు పేరడీ ..

వాడ వాడనా చైనాలోన వీధి వీధినా విశ్వములోన
ఈ లోకం మీద దయలేదా కరోనా..
ఏ పాపం చేస్తే పుట్టుకొచ్చావే వూహానా
ఈ లోకం మీద దయలేదా కరోనా..
ఏ పాపం చేస్తే పుట్టుకొచ్చావే వూహానా

చేయి కడగమ్మా సబ్బూరాసి రుద్దీ పెడితె రానెరాదమ్మా
ఇంటనుండమ్మా అంటుకుంటె కంటి కునుకు రానెరాదమ్మా

పెద్ద ప్రాణాలే లక్ష్యంగా వృద్ధజీవులే భక్ష్యంగా 
ఊపిరి తీయనీకుండా ఉసురుపోయనీకుండా "2"
కరడుగట్టిన ఉన్మాదిలా కరోనా
నువ్ కాటేస్తుంటే వల్లకాడే లోకానా
ఈడు పిల్లల గోడు చూడవే కరోనా
ఎంత కడిగినా చేతిరాతలు మారేనా

వాడ వాడనా చైనాలోనా వీధి వీధినా విశ్వములోన కరోనా..

కరోన అంటే కడిగేస్తే పోదూ ఓ యమ్మా..నీకై నిన్నే నిర్బంధించాలి..అహు అహు
మూతీ ముక్కూ మాస్కుల్లొ పెట్టీ ఓ యమ్మా బయట ఎక్కడా తిరగబోకమ్మా అహు ..అహు

లక్షల మందికి పంచినావె అంక్షలు ఎన్నో పెంచినావె
బల్లూ గుళ్ళూ మూసినావె వల్లూ గుల్లా చేసినావె "2"
అందనంతలా ఆర్థిక మాంద్యం పెరిగేనా 
కొలువులన్నీ కోరకాటున తరిగేనా
ఒక్కసారి గుట్టు చిక్కితే నీపైనా
స్వారీ చేసి ఘోరీ కట్టమా నీకైనా..

మానవాళికే ముప్పును తెచ్చే అవని జాతినే తిప్పలుపెట్టే
నీ జాతుల జాడ మెడలొంచేది మనిషేరా
చరిత నీడలొ నిలిచే ధర్మం సత్యం రా ... "2"


22, ఫిబ్రవరి 2023, బుధవారం

చెప్పనా..?

 ఏమని చెప్పను ఎన్నని చెప్పను..?

మన freshers day  రోజున అనుకోకుండా వేసిన కిటుకులు తెలిసిన చిటపట చినుకుల పాట చిందులకు వచ్చిన చప్పట్ల మోత గురించి చెప్పనా.. ?

అమరావతి పర్యటనలో ఆహ్లాదంగా గడచిన ఆ మధురానుభూతుల మాధుర్యాల గురించి చెప్పనా..?

హాస్టల్లో చిరు పాట చిత్రలహరిలొ రాగానె చిందేసిన గెంతుల గురించి చెప్పనా..?

చంద్ర కళ ఈ చంద్ర చెల్లికి కొన్న నైటీ సహకారపు ఆనవాల్లు చెప్పనా..?

general quiz లో  మొదటి బహుమతి సాధించిన విజయ దరహాసాల  vizag trip గురించి చెప్పనా..?

మొదటిసారి జీవితంలో Fail అన్న పదాన్ని పరిచయం చేసిన EM Subject గురించి చెప్పనా..??

BSN reDDi class లో బిక్కు బిక్కు మంటూ బిత్తరపోయిన సంఘటనలు గురించి చెప్పనా..?

దొంగ చాటుగా గోడ దూకి విజయలక్ష్మి థియేటర్లో చూసిన second shows  గురించి చెప్పనా..?

చంద్ర మౌళీ గారు చెప్పే అంతరిక్షపు గ్రహాల్లో నే వూహించుకున్న నా స్వప్న సుందరి గురించి చెప్పనా..?

College Annual Day కు చిరు పాటకు Stage మీద అడుగుపెట్టి లయబద్దంగా వేస్తున్న అడుగులు అర్థాంతంగా ఆగిపోయి రెచ్చిపోయిన కుల విషనాగుల కాట్లకు ఈ కాటుబోయిన ఎంతలా వ్యధ చెందాడొ చెప్పనా..?

వీడ్కోలు వేదనలో విడవలేక స్నేహితులను కార్చిన కన్నీటి కథ చెప్పనా..?

చివరగా...ఒక్కమాట..

కుల కౌగిట్లో నలిగిన నా సహ విద్యార్థుల  వేదన గురించి ఈ ఒక్క వాక్యంలో నే చెప్పగలనా? 

వదిలితే వందపేజీలు నిరాఘాటంగా రాసి ఆ క్షుద్రమూకల దౌర్జన్యాలను,వారి ఆగడాలను ఓ మహా కావ్యంగా వేయి పడగలా కాకున్నా ఓ వంద పడగలా అయినా రాయగలనని ..మీ

-చంద్ర కాటుబోయిన  




ఆటా పాటా అన్నిట్లో మేటీనే ..

బరిలో దిగితే లేడెవరూ పోటీనే ..

మాటా మాటా కలిపాడంటే 

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల

బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల

నీ పేరేందో దెలువది

నీ ఊరెందో దెలువది

నువ్ యేడుంటవో దెలువది

నువ్ ఎట్లుంటవో దెలువది

ఐనా నా ఎద సాటు

నీ బొమ్మే గీసుకున్న

నీ పేరే రాసుకున్న

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల

బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల

బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల


నిన్నూ జదివిన నుంచి నన్నూ నేను మరిసిన

అన్నీ ఇడిసిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన

నిన్నూ జదివిన నుంచి నన్నూ నేను మరిసిన

అన్నీ ఇడిసిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన

ఎక్కడనా చేతినుంచి జారిపోతవో అని

గుబులైతాందే గుండె బరువైతాందే

పరిసానైతాందే పాణమెళ్లి పోతాందే



నిన్ను తెలియగ నెంచి

నన్ను నేను మరిసిన

అంతట నిన్ను గాంచిన

అందరి మంచి గోరిన 


ఎప్పుడు ఈ గ్యానం నా మతిలో నిలిచేలా

నిండి పోరాదే

నా గుండెల ఉండి పోరాదే

చివరకు నేనే నువ్వై మిగిలి పోవాలే


21, ఫిబ్రవరి 2023, మంగళవారం

అంతరంగం ...

 అంతరంగం ...


అందంగా ముస్తాబు చేసి అంగట్లో పెడితే ..

అలంకరణ కోసం కాబోలు .. అని  గర్వపడ్డా ..

అద్దాల గదిలో మువ్వురం ఇరుక్కుని 

ఊసుపోని కబుర్లలో ఉక్కిరి బిక్కిరవుతున్నాం ..

అంతలోనే కిడ్నాప్ చేస్తున్నారేమో అనేంతగా 

అమాంతం అరచేత్తో ఒడిసిపట్టుకొని ఆరుబయటికి అరుదెంచారు ఎవ్వరో ..

కారులో షికారుకు తీసుకొచ్చారులే అని 

సంబరపడ్డాం ..

క్షణమాలస్యం ..మా గది తలుపులు తెరిచారు .. అంతే 

ఒక్కసారిగా రెక్కలొచ్చీ గువ్వలా ఎగిరి దుమికాము .. 

పరిసరాల పచ్చని చెట్లు పలకరించినట్టు 

పిల్ల తెమ్మెర నాదాల పిలుపులతో పులకరించినట్టు 

మా ఆనందం ఆకాశాన్నంటేలోగా ..

ఏదోసుతిమెత్తగా తాకింది ..తోశారా అని అనుకొనేంతలో ..ఎగిరి అటుపడ్డా ..

అటుపక్కనుండి మల్లీ గట్టిగా ఎవరో వీపుపై చరిచినట్టు ఉలిక్కిపడ్డా ..అంతే 

ఇటువైపు నుండి మరింత కసిగా మరొకడు ..

అంతకంటే బలంగా ఇంకోడి బాదుడు ..

ఒకడేమో గింగిరాలు తిప్పడం 

మరొకడు ఊచకోతనే నయమన్నట్టు కోయడం ..

ఇలా ఎడా పెడా అటూఇటూ  కొడుతుంటే ...ఆడుకుంటుంటే .. 

అప్పుడర్థమైంది ..

మా అయువు ఈ ఆటగాళ్ళు అనుకొనే వేటగాళ్ళ చేతిలో మూడిందని ..

నాతోటి సోదరులకు కూడా ఈ ముప్పు తప్పదని ..

కొన్ని ఘడియలకు నీరసంగా కొన ఊపిరితో ఉన్న మమ్మల్ని .. 

చెత్త బుట్టలో వేయడంతో మా ప్రాణాలు .. అలా గాలిలో ..కలిసిపోయాయి 

ఇకపై వద్దు ఈ బంతి జన్మ ..ముద్దు ఆటగాడి జన్మ  

మీ 

🎾

నటశేఖరా .. ! నివాళి 🙏🏻

 ధైర్యం మూగబోయింది...

సాహసం కన్ను మూసింది..

ఉదారతకు ఊపిరాగింది..

తేనె మనసులతో తెలుగు వీర లేవరా అంటు తెలుగు వారి గుండె తట్టిన మగధీరా ..

లవ్ బాయ్ , గూడ్ బాయ్ లాంటి మూస పాత్రలకు చరమగీతం పాడిన కౌబాయ్ గా ..

తెలుగు నిర్మాతల పాలిటి కల్పతరువుగా 

జనాదరణలో అసాధారణ ఆంధ్రా జేమ్సు బాండ్ గా ..

సినీ జగత్తులో విప్లవాత్మక సాంకేతికతకు చిరునామాగా ..

తెలుగు చలన చిత్ర సిం హసనం పై తెగువ కల్గిన బుర్రి పాలెం కుర్రోడుగా ..

తెలుగు కళామతల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్న నటశేఖరా .. 

అశ్రువులు బాసిన నయనాలతో .. భావోద్వేగాలు నిలువెల్లా దహించుకుపోయే దోసిల్లతో అర్పిస్తూ ఇదే ఘట్టమనేనికి ఘనమైన కన్నీటి నివాళి 🙏🏻

Naalo nenu

 

మునుపెన్నడూ హృదయం ఇంతగా ద్రవించనే లేదు 

కనులెప్పుడూ ఇంతగా వర్షించనూ లేదు 

తనువెన్నడూ ఇలా తల్లడిల్లిందీ లేదు 

ఇంతలా ఎందుకనో ..? 

మాటలేమో ..

     మంచులో కూడా సెగలు రగిల్చే తూటాలు 

     కంచు స్వరాన నరాలు తెంపే కరుకైన చుర కత్తులు 

     అణచలేని ఆవేశాన వివేకమడుగంటి విసిరే పిడి బాకులు

      ఎందరున్నా ఎదుటివాడి గుండెల్లో గుచ్చే గునపాలు 

మరి మనసెందుకిలా ..

   పొరుగింటి తల్లి కన్నీరు మున్నీరవుతున్నా ..

   అప్పగింతల వేల ఆడబిడ్డ శోకాలు పెడుతున్నా ..

    అప్పుడే పుట్టిన పసికందు వెక్కి వెక్కి ఏడుస్తున్నా ..

     కట్టుకున్న అమాయక చిన్నది  కంట తడి కాంచినా .. 

నిలువెల్లా కరిగిపోతా 

తలుపుల్లో మరిగిపోతా 

కన్నీటి కడలిలో జారిపోతా .

కడకు చిత్రంగా ....

 ఏ చిత్రమందైనా చీమంత చింతనా భరిత సన్నివేశమందును 

అంతులేని నిర్వేదానికి లోనవుతా  

కన్నీటి ధారలలో తడిసి బయటికి కనపడనీయని తుఫానులో సమిధనవుతా ..

వెరసి నాదైన సమాజాన కదలిపోతా కలసిపోతా .. 

-చంద్ర

Tennis-Beauty

 కను చూపు మేరలో .. కళ్ళకు కట్టినట్టు ..

అందమైన బంతాటలో ఆనందాలు విరబూసినట్టు 

కొట్టే ప్రతి షాటుతో కోరికలు చెలరేగేట్టు 

టెన్నిస్ ఆటతో వసంతాలు వచ్చినట్టు 

పున్నమి వెన్నెల ఆటలో పూనకాలొచ్చినట్టు 

ఆడే మన ఆటలో ఆనందాల అంచులను తాకినట్టు .. 

ఏమిటీ ఆట కనికట్టు .. ఎప్పుడీ ఆట కట్టు ? 

ఈ ఆట కనిపెట్టిన ఓ బ్రహ్మ .. ధన్యమైంది మా జన్మ 🙏🏻